జ్ఞానం ఉన్నవాడు
ఆజ్ఞానికి భయపడడు
అజ్ఞానం ఉన్నోడు
జ్ఞానికి ఎదురు పడడు
నా జాతి బిడ్డలు
జ్ఞానం తో వెలగాలి అనుకున్న
విజ్ఞానం తో మెలగాలి అనుకున్న
సమాజంతో సమానంగా నడవాలి అనుకున్న
కానీ…
అజ్ఞానం లో ఉంటూ
అడుకుతినేలా వుంటారని
మోచేతి నీళ్లు తాగిన కూడా
మోకాళ్లలో బుద్ధి మారలేదు
ఇంకా..
అందుకే సిగ్గు బడుతున్న
ఎక్కడో అడుగు నీ చరిత్ర
నిలదొక్కు చోట
కూలదొక్కే మాట
ఇదేనా నీ చదువులు చూపిన బాట
నా జాతి రక్తం
జగతి రుణపడేలా చేసింది
నా జాతి కలం
ప్రపంచ జ్ఞానుల్లో ఒకడిని చేసింది
అక్షరం..
జ్ఞానంలో బతకాలన్నది
అజ్ఞానం లో ఉండి అడుక్కుని
బానిసగా బతకాలనలేదు
వొంగి మొక్కే రోజులు
డొంక మాటల తీరులు
కుంటి సాకుల బతుకులు
ఎన్నాళ్లు..కొన్ని రోజులే
అలా ఉన్నన్ని రోజులు
నీ మూర్ఖత్వాన్ని మూసి పెట్టిన
మూసిలో పాతి పెట్టిన
గోతిలో దాచి పెట్టిన
నీ పతనానికి తెర తీసినట్టే
గుర్తుంచుకో
తెలివి తక్కువ ఎక్కడో లేదు
సంకర జాతి బిడ్డల
పొట్టలో విషమల్లే నిండి
పౌరుషం లో వెదజల్లు తుంది చూడు
నేడు
జాతి కడుపున పుట్టి
నిజరూప రాక్షస జాతికి
నిలువుటద్దం లా మెరిశావు
పెరిగేదేందుకు విరిగేటందుకు
అన్నట్టు శభాష్….
ఎదగడం ఓర్వక
ఎదిరించే శక్తి లేక
నికృష్ట బుద్ధితో నిజం బలికావు
నిలువెల్ల కుళ్లును చూపావు
కళ్ళున్న కబోధిలా
నాచులున్న కప్పలా
ఇదేనా
అమ్మ నాన్న పెంచిన రక్తం
ఇదేనా
పక్కలేసిన పతివ్రత సూత్రం
కాలం మారింది..
కుతంత్రాల కుట్రలు
కులంలో చిచ్చులు
మాటల్లో మంత్రాలు
కొన్నాళ్ళే..
కోలుకున్నరు ఇప్పుడిప్పుడే
నడవదు ఇంకా చాన్నాళ్లే
మనిషన్న వాడికే మాటలు
గాడిదకెవడు చెప్పడు నీతులు
గాడి దప్పిన బుద్ధి రాలే
గోడ కొట్టిన సున్నమోలే
అందుకే…మేలుకో
ఓ నా జాతి బిడ్డ
మేలు బంగ్లాల వున్న
నీ మేను మాదిగనే
బంగారు పళ్ళెం లో తిన్న
నీ బతుకు మాదిగనే
ఎంత ఎదిగిన
బొంత మిగిలినా
చింత దీరునా..
ఈర్ష్య ద్వేషాలతో ఇల్లలికి
పందిరేసుకున్న మంద బుద్ధి ఇంటి దొంగలు
మారాలి మన సమాజం
ఎప్పటికైనా…ఇప్పటికైనా..
రచన..

కళా శేఖర్, ( జానపద కళాకారులు)
రాజాపూర్ మండలం రిపోర్టర్
సూర్యుడు పత్రిక