పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 31. తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు చేసిన ప్రసంగం ప్రధానంగా గత బీఅర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, నల్గొండ జిల్లా అభివృద్ధి, మరియు నియోజకవర్గ సమస్యలపై కేంద్రీకృతమైంది. ఆయన తన ప్రసంగంలో బీఅర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు . బీఅర్ఏస్ ప్రభుత్వ వైఫల్యం: పదేళ్ల బీఅర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, కేవలం కుటుంబ పాలన సాగిందని విమర్శించారు. నల్గొండ జిల్లాకు అన్యాయం: తన మునుగోడు నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాకు గత ప్రభుత్వం నీళ్ల విషయంలో, అభివృద్ధిలో తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం: రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధి: మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. రాజకీయ విమర్శలు: అసెంబ్లీ వేదికగా బీఅర్ఎస్ ప్రజాప్రతినిధుల తీరును, గతంలో జరిగిన అవినీతిని ప్రశ్నించారు. తన ప్రసంగంలో ప్రజల సమస్యలను బలంగా వినిపించడంతో పాటు, గత పాలకుల విధానాలను నిలదీశారు. నిధుల కేటాయింపులో వివక్ష: ప్రభుత్వం ఎమ్మెల్యేలకు సరైన నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కేవలం ముఖ్యమంత్రి మరియు మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, అక్కడ మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ పనితీరుపై అసహనం: సొంత పార్టీ (కాంగ్రెస్) ప్రభుత్వంలోనే తన నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంపై విమర్శలు: అసెంబ్లీలో బీఆర్ఎస్ (BRS) పార్టీ వైఖరిని మరియు గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ముఖ్యమంత్రికి సూచనలు: పాలన మరియు నిధుల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు సూచనలు మరియు విమర్శలు చేశారు. అభివృద్ధి పనులు: ఎమ్మెల్యేలందరినీ సమానంగా చూడాలని, అన్ని నియోజకవర్గాల్లో పనులు జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యపై గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విద్యా వైద్యాన్ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో సరిపడా మౌలిక సదుపాయాలు లేవు . ఒక విద్యార్థి ఉన్నచోట ఎక్కువ మంది టీచర్లు ఉన్నారు 100 విద్యార్థులు ఉన్నచోట 1 టీచరే ఉన్నాడు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40% మెస్ చార్జీలు పెంచినప్పటికీ ఆహారంలో నాణ్యత లేదు… క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది బడ్జెట్లో అత్యంత తక్కువ విద్యకు కేటాయించారు గత ప్రభుత్వాన్ని రెండుసార్లు గెలిపిస్తే పేద ప్రజల జీవితాల్లో మార్పులు రాలేదు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు గ్రాస్ రూట్ లో పేదల ఆశలు నెరవేరలేదు . విద్య పై ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో నాణ్యమైన ఆహారం విషయంలో మానిటరింగ్ ఉండేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు చాలా గొప్ప పథకం అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుగా పోతున్న ఈ స్కూల్స్ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ఇది అభినందనీయం ప్రశంసనీయం అన్నారు ఇరిగేషన్ పై తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ఎన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసి ఎన్నో లక్షల ఎకరాలకు నిరంధించింది . తెలంగాణ వచ్చాక రీ డిజైన్ పేరు మీద లక్షల కోట్లు ఖర్చు చేసి ఏ రకంగా అప్పులపాలు చేశారు ఇప్పటికే చాలాసార్లు చర్చించాం . తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పిన వినకుండా కెసిఆర్ ఇంజనీర్ గా మారి మేడిగడ్డకు బ్యారేజ్ని మార్చారు ఇది కూలిపోయే స్థితికి వచ్చింది . గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం అప్పలపాలైంది ఒక్క ఎకరాకు నీరు రాలేదు దిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా శివన్న గూడెం రిజర్వాయర్ను కూర్చి వేసుకుని పూర్తి చేస్తానని చెప్పి పది సంవత్సరాలు గడిపిండు కెసిఆర్ . రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కొని రిజర్వాయర్ కట్టారు కానీ ఎక్కడినుండి నీరు తీసుకురావాలో డిసైడ్ చేయలేదు హెడ్ వర్క్స్ మొదలుపెట్టలేదు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదుల రిజర్వాయర్ నుండి 16 కిలోమీటర్ల టన్నెల ద్వారా నీటిని తీసుకొచ్చి నాలుగు లక్షల ఎకరాలకు నిరం అందించే కార్యక్రమం మొదలుపెట్టాం కేవలం మంత్రులు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మాత్రమే నిధులు వస్తున్నాయి ఎమ్మెల్యే నియోజకవర్గాలకు నిధులు రావడం లేదు ఎమ్మెల్యేలకు ప్రియారిటి ఇవ్వాలి ప్రియారిటి బేస్ గా వెంటనే పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లు మంత్రులు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. ఏ ప్రజా ప్రభుత్వం ఇలా చేయలేదు సంక్షోభంలోకి నెట్టే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ పేదల పార్టీ ఈ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు వెళ్తుంది ఓవైపు సంక్షేమ పథకాలు అనుసరిస్తూనే బడ్జెట్ కేటాయింపులు వాళ్ళు చేసిన అప్పులు వాటికి మిత్తులు కడుతూ ఆర్థిక పరిస్థితి గాడిన పెట్టడం ముళ్ళ కిరీటం లాంటిది. కాలేశ్వరం మూడు సంవత్సరాల్లో పూర్తి చేశారు పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారు నేను ఎంపీగా పార్లమెంట్లో కొట్లాడే తెలంగాణ తీసుకొచ్చాం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రద్ధ తీసుకొని ప్రాజెక్టులు పూర్తి చేస్తారని కోరుతున్నా ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎన్ని నిధులు వచ్చినా అక్కడికి వెళ్తున్నాయనేది బయట టాక్ అందరినీ సమానంగా చూడండి విపక్ష చూపకండి అన్ని నియోజకవర్గాల మీద శ్రద్ధచూపి అభివృద్ధికి నిధులు ఇచ్చే ఆదుకోవాలని కోరుతున్నా . గత ప్రభుత్వం కంటే ప్రజా ప్రభుత్వం వెయ్యిరెట్లు పారదర్శకత్వంతో నిజాయితీతో పనిచేస్తుంది . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక క్రమశిక్షణ నిర్ణయాలు బాగున్నాయి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 714 కోట్ల రూపాయలతో లక్ష ఎకరాల నీటిని అందించే విధంగా బ్రాహ్మణ వెళ్లేంల ప్రాజెక్టు తీసుకొచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2004 నుండి 2014 మధ్య 90% ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి.. 2014 నుండి టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక పని కూడా చేయలేదు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగతా పనులు పూర్తి చేసి బ్రాహ్మణ వెల్లెంలా రిజర్వాయర్ లోకి నీటిని నింపాం . కాలువల పూర్తి చేసి పొలాలకు నీరు రావడం లేదు తొందరగా బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాలి. ఏ కేటగిరీలో చేర్చి తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నా రోడ్డు ప్రమాదాల నివారణకు సభలో ప్రసంగిచిన రాజగోపాల్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా( HAM) రోడ్లకు 34 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు జిల్లాల నుండి మండలాలకు వెళ్లే రోడ్లకు ప్రమాదపు మూలమలుపులు ఉన్నాయి . ఈ(HAM) రోడ్ల టెండర్లలో ఆ ప్రమాదపు మూలమలుపులకు కూడా భూసేకరణ చేసేలా మార్పులు చేయాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిని స్ట్రైట్ గా చేయాలి . రోడ్డు సేఫ్టీ అనేది చాలా ముఖ్యం.. మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరగడం ఒక భాగం అయితే సరైన రోడ్డు లేక ప్రమాదాలు జరగడం కూడా ఇంకొక భాగం (HAM) రోడ్లను పర్యవేక్షించేందుకు స్వతంత్ర ఇంజనీర్లను నియమించాలి లేకపోతే ప్రజాధనం వృధా అవుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుచించారు .