ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి : ఏఐటీయూసీ

పయనించే సూర్యుడు-31-03-2026-రాజంపేట న్యూస్ : రాజంపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ గుంటి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా కార్యకర్తలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒకటిన్నర సంవత్సరం గడిచినా ఆశా కార్యకర్తల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం చూసీ చూడనట్టుగా వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు. ఆశా కార్యకర్తలు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకలాంటివారని, కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించిన వారిని ప్రభుత్వం విస్మరించడం అన్యాయమని అన్నారు.“ఇకపై మాటలు కాదు – చర్యలు కావాలి” అని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తల జీతాలను వెంటనే పెంచాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి శాశ్వతం చేయాలని, సెలవులు, భద్రత, పెన్షన్ వంటి హక్కులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎం. గంగాధర్, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ యు. మరియమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ టి. అనసూయ,ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి సికిందర్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు లలితా ,రెడ్డమ్మ, సురేఖ రెడ్డమ్మ గంగాదేవి విజయ వరలక్ష్మి రేణుక రాజేశ్వరి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *