ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

తాసిల్దార్ కు సమస్యలు తో కూడిన వినతి పత్రం

పయనించే సూర్యుడు మార్చి 31 మాచారెడ్డి మండలం రిపోర్టర్ కామారెడ్డి జిల్లా చుక్కాపూర్ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రాజధానిలో ధర్నా నిర్వహిస్తున్న బీజేపీరాష్ట్ర ప్రధాన కార్యదర్శి , ఇతర నాయకులును అక్రమంగా అరెస్టు చేయటాని నిరసిస్తూ సోమవారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తాసిల్దార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భారతి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాలలో ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి ఆశ వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఎంతకాలం అయినప్పటికీ ఆశ వర్కర్ల 18 వేల రూపాయలు వేతనం పెంచడానికి రేవంత్ రెడ్డి సర్కారుకు చేతుల రావటం లేదుని, గత ప్రభుత్వం మాదిరిగానే హక్కులు అడిగితే అరెస్టులు నిబ్బందాలకు పూనుకుంటున్నారని అన్నారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం 18000 అమలు చేయాలని, 50 లక్షలు ఇన్సూరెన్స్,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.