ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు నెలరోజుల ఉచిత ఇంటర్న్‌షిప్

ప్రిన్సిపల్ డాక్టర్ గీతాంజలి

పయనించే సూర్యుడు మార్చి 31 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. గీతాంజలి తెలిపారు. విద్యార్థులలో వృత్తి నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు, వ్యక్తిత్వ వికాసం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ ఇంటర్న్‌షిప్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్, కృత్రిమ మేధస్సు ఏ.ఐ. (AI) సహాయంతో ఎమ్మెస్ ఆఫీస్ బేసిక్స్, వ్యక్తిత్వ వికాసం, అలాగే తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు మరియు సాహిత్యంపై శిక్షణ అందించబడుతుంది. ఇంటర్మీడియట్ తాజాగా లేదా గత సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి అర్హులు.శిక్షణా కార్యక్రమం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నాగర్‌కర్నూల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్), శ్రీపురం రోడ్‌లో నిర్వహించబడుతుంది. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ముందస్తుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు సిద్ధమవడంతో పాటు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుందని ప్రిన్సిపాల్ గీతాంజలి పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 6302057411, 81792 26268 నంబర్ లను సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *