ఇద్దరూ పారిశ్రామిక దిగ్గజాలు. స్నేహానికి ప్రతిరూపకాలువీరిద్దరూ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 31 పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలోని ఈ రోజున పారామౌంట్ అధినేత వెనిగళ్ళ సురేష్ ని పరామర్శించడానికి సోమవారం సాయంత్రం పారామౌంట్ స్టిల్ ఇండస్ట్రీకి విచ్చేసిన బి.ఆర్.కే న్యూస్ ఛానల్ అధినేత బొల్లా రామకృష్ణ కష్టేపల్లి సుఖి అన్న సిద్ధాంతాన్ని నమ్ముకొని దానిని ఆచరించి చిన్ననాటి నుండి అవిరల కృషిచేసి సమాజంలో నేడు వేలాది మందికి సహాయం చేసే స్థాయికి ఎదిగిన పారామౌంట్ స్టీల్ అధినేత వెనిగళ్ళ సురేష్ , కుగ్రామమైన తాళ్లూరు నుండి హైదరాబాదు భాగ్యనగరానికి వెళ్లి చిన్న జీతంతో తన జీవితాన్ని ప్రారంభించి ఈనాడు వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను సమాజానికి చూపించాలన్నటువంటి సంకల్పంతో సత్య నిష్టతో మీడియా రంగంలో. బి .ఆర్. కే. న్యూస్ ఛానల్ స్థాపించి అనతి కాలంలో అంచలంచెలుగా ఎదిగి ఈరోజు మీడియా రంగంలో ప్రపంచ స్థాయిలో సమాజాన్ని శాసించే స్థాయికి ఎదిగిన బొల్లా రామకృష్ణని మనందరం అభినందించాల్సిందే. వీరు వ్యాపార రంగంలోనే కాకుండా, ఆధ్యాత్మికంగానూ,సామాజిక సేవలోనూ, ఆపన్న హస్తం కోసం సహాయం కావాల్సిన ప్రతి పేదవానికి వారు సహాయం చేసిన వారే. నందిగామ డివిజన్ లో చాలామందికి వివిధ రంగాలలో వివిధ రూపాలలో సహకరించినటువంటి వారే.పారమౌంటు స్టీల్ అధినేత సురేష్ ని పరామర్శించడానికి విచ్చేసినటువంటి బొల్లా రామకృష్ణ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన పారామౌంట్ స్టీల్ అధినేత వెనిగళ్ళ సురేష్ . వీరితో పాటు విద్యావంతుడు వినయ్ శీలి ఆధ్యాత్మిక,సామాజిక రంగాలలో మంచి పేరున్న గూడపాటి శ్రీనివాసరావు, రేపాల మోహన్ రావు లు పాల్గొన్నారు. విచ్చేసిన వారందరికీ సురేష్ కృతజ్ఞతలు తెలిపారు.