పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ -31 అంతర్గాం ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ మామిడాల కరుణాకర్ 38 సంవత్సరాల సేవ తర్వాత ఈ నెల 31న పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం జరిగింది. ఎంపీడీవో జీ.తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కే.నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బోయ వెంకటస్వామి, జిల్లా ఎంపీడీఓలా అధ్యక్షులు దివ్యదర్శన్ రావు, జిల్లా యంపీఓలా అధ్యక్షులు అనిల్ రెడ్డి, జిల్లాస్థాయి, మండల అధికారులు, అంతర్గాం మండల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘ ప్రతినిధులు పాల్గొని, కండువాలు, శాలువాలు, జ్ఞాపికలు అందజేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.వారి సేవలను కొనియాడుతూ, వారి విశ్రాంత జీవితం ఆరోగ్యకరంగా సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల కోటేశం, ఉపాధ్యక్షులు బండి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి పెండెం సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కుడిక్యాల హరీష్ లు వారి సంఘ కార్యకలాపాలలో కరుణాకర్ సేవలను కొనియాడి మార్కండేయ దైవం ఫోటోను జ్ఞాపికగా బహూకరిస్తూ, మిఠాయి తినిపించి, చేనేత కండువాకప్పి గోదావరి- కరుణాకర్ దంపతులను ఘనంగా సన్మానించి, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.