కనకగిరి మిషన్ భగీరథ ప్లాంట్ నిలిచివేత

పయనించే సూర్యుడు: మార్చి 31/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె.విజయబాబు ప్రజలకు తక్షణ నీటి సదుపాయం కల్పించిన కల్లూరు పుర చైర్మన్ దరావత్ మోహన్ నాయక్ వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి నాలుగు మండలాలకు తాగునీరు సరఫరా చేసే కనకగిరి మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ గత నాలుగు రోజులుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ శనివారం తక్షణ చర్యలు చేపట్టారు. సమస్య తీవ్రతను గుర్తించిన ఆయన తల్లాడ మండలం గూడూరులో ఉన్న ప్లాంట్‌ను స్వయంగా సందర్శించి మరమ్మత్తుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన చైర్మన్, పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. అధికారులు స్పందిస్తూ మరమ్మత్తులు పూర్తయ్యగానే నీటి సరఫరా ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని డివిజనల్ ఇంజినీర్ హరి కూడా ధృవీకరించగా, ఈరోజు సాయంత్రం నాటికి నీటి విడుదల జరుగుతుందని సమాచారం. వేసవికాలం నేపథ్యంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో, ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసింది. ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని తక్షణ స్పందన చూపే నాయకత్వం అవసరమని, అలాంటి నాయకుడిగా మోహన్ నాయక్ సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణం శెట్టి లక్ష్మీ కొండలు, ఉబ్బన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *