కారుకొండ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ

కార్యక్రమంలో లైన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి హెడ్మాస్టర్ రామకృష్ణ

పయనించే సూర్యుడు మార్చి 31 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలంలోని కారుకొండ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. లైన్స్ క్లబ్ సభ్యుడు వాస రాఘవేందర్ కుమారుల పుట్టినరోజు సందర్భంగా, జిల్లా లైన్స్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ఆరోగ్య పరిరక్షణలో శుభ్రమైన నీటి పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. విద్యార్థులు ఆనందంగా బాటిల్స్ స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకటేశ్వర రావు, కాశి రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డి రామకృష్ణ ఉపాధ్యాయులు శ్రీకాంత్ భాగ్యలక్ష్మి ఇంద్రాణి లావణ్య భారతి కె రామకృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *