పయనించే సూర్యుడు మార్చు 31 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి పి4 మార్గదర్శకులుగా నిలుస్తూ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆదోని పట్టణంలో రాయనగర్ ఐరన్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి, తన స్వంత నిధులతో ₹95,000 ఖర్చు చేసి పేద మహిళలకు సహాయం అందించారు అదేవిధంగా “గుడిసె కృష్ణమ్మ సేవా సమితి” ద్వారా స్వచ్ఛభారత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సుల్తానపుత్రం గ్రామాన్ని దత్తత తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం పేద ప్రజలకు అండగా నిలుస్తూ, వారి మనసులను గెలుచుకున్నారు. ఆమె చేసిన సేవలను గుర్తించిన నిర్వాహకులు గౌరవప్రదంగా అవార్డు అందజేశారు. సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే కృష్ణమ్మ గారు ఈ అవార్డు అందుకోవడం ఆదోని పట్టణానికి గర్వకారణం. ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని ఆమె తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శి-బంగారు కుటుంబం పి4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమం 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించి నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సంపన్నులు (మార్గదర్శకులు) నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని విద్య, వైద్యం ఉపాధి వంటి సౌకర్యాలను కల్పిస్తూ ఆ కుటుంబాలను బంగారు కుటుంబాలు గా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం పి4 బంగారు కుటుంబం కార్యక్రమం యొక్క ప్రధాన లాభాలు దత్తత మరియు మద్దతు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు లేదా దాతలు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని, వారి అభివృద్ధికి బాధ్యత వహిస్తారు జీరో పావర్టీ లక్ష్యం: 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం లేని స్థితిని జీరో పావర్టీ సాధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం అదనపు సంక్షేమ సాయం: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, పి4 ద్వారా అదనపు సహాయం ఆర్థిక, ఉపాధి అందుతుంది విద్య మరియు వైద్యం బంగారు కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య, కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి: కుటుంబ సభ్యులకు నైపుణ్య శిక్షణ అందించి, సొంత కాళ్లపై నిలబడేలా ఉపాధి అవకాశాలు చూపిస్తారు మార్గదర్శకత్వం దత్తత తీసుకున్న వారు ఆ కుటుంబానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ, వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన నిరుపేద కుటుంబాలకు స్థిరమైన సామాజిక-ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది.
