
పయనించే సూర్యుడు, మార్చి 31 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) రంగారెడ్డి జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ నేతృత్వంలో జిల్లా స్థాయి అండర్ 20 పురుషులు,మహి ళల కుస్తీ పోటీలు ఘనంగా జరిగాయి. తుల్జాభవాని వ్యాయామశాల ఆధ్వర్యం లో గోపినగర్ ప్రధాన కూడలిలో సోమవా రం జరిగిన ఈ పోటీలలో జిల్లాలోని వివి ధ వ్యాయా మశాలల నుంచి దాదాపు 100 మంది క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఫ్రీ స్టైల్ వివిధ కేజీల విభాగంలో అభినయ్, శ్రీధర్, భరత్ బాబు, నాగేందర్, ఉమేష్, పియూష్ సింగ్,అభిషేక్,జయ కిషన్ యాదవ్, సోమనాథ్ రెడ్డి,మహిళలు అపూర్వ,లక్ష్మి,శ్రీనిధి,రోమన్ గ్రీక్ స్టైల్ విభాగంలో వివిధ కేజీల పోటీల్లో శివకు మార్, ప్రణవ్ కుమార్,సాంబా ధనుంజ య్, సందీప్ చరణ్, సంపత్ కుమార్, దీప్ సింగ్, రవి కిరణ్, అభిరామ్ రెడ్డిలు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మీరందరూ ఏప్రిల్ 2వ తేదీ కామారెడ్డి లో జరగనున్న స్థాయి రెజ్లింగ్ పోటీలకు అర్హత సాధించారు. విజేతలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పిసిసి ప్రధాన కార్యదర్శి శేరిలింగంపల్లి ఇన్చార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, బిఆర్ఎస్ శేరిలిం గంపల్లి ఉమ్మడి డివిజన్ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్,మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజి కౌన్సిలర్ దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి,మూల వెంకటేష్ గౌడ్, దుర్గం వీరేశం గౌడ్, విజయ్ కు మార్ రెడ్డి, కాటా నరసింహ గౌడ్,కొమ రగౌని వెంకటేష్ గౌడ్, పుట్ట వినయ కుమార్ గౌడ్, బెజగం కేశవులు,లీలానం ద్ గౌడ్, గోపాల్ యాదవ్, కలివేముల వీరేశం గౌడ్, పుట్ట శ్రీకాంత్ గౌడ్, గఫూర్, పవన్ గౌడ్, నర్సింహా తదితరులు పత కాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లా డుతూ.. కుస్తీ అంటే భారతీ య ప్రాచీన మల్ల యుద్దామని ఒలంపి క్స్ లోను ప్రాధాన్యతను సంత రించుకున్న అన్నా రు.అలాంటి కుస్తీ వైపు యువత అడుగు లు వేయడం అభినందనీయమని అన్నా రు.లింగంపల్లిలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించిన తుల్జాభవాని వ్యాయామ శాల నిర్వాహకులు లచ్చ మొళ్ల పాండు గౌడ్,వారి కుమారులు అరవింద్ గౌడ్, మోహన్ గౌడ్,రోషన్ గౌడ్ లను ప్రత్యే కంగా అభినందించారు.ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా అమె చ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కే.యాదయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.పాం డు,ఉపాధ్యక్షులు హీరలా ల్,కార్యదర్శి భగవాన్ సింగ్,కుస్తీ ప్రముఖులు రాజు, శ్రీధర్,రాజ్ కుమార్,సుధాకర్,రమ్య,శ్రీ నివా స్,విశ్వంభర్ సింగ్,నవీన్,ప్రకాష్ సింగ్ బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.