చంద్రమౌళి కి పి4 ధ్రువీకరణ పత్రం పంపిణీ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చ్ 31.03.2026 మదనపల్లి అన్నమయ్య నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెద్ద కొండా మరి మాజీ సర్పంచ్ పూల చంద్రమౌళికి పి ఫోర్ ధ్రువీకరణ పత్రం అందించి సత్కరించారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపును స్వాగతిస్తూ కోటూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి దిశగా పనులను ఆయన చేపట్టారు ఇందుకుగాను నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో ఎంపీడీవో కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో పూల చంద్రమౌళికి పి4 ధ్రువీకరణ పత్రం ఎంపీడీవో లీలా మాధవి అధికారులు నాయకులు అందించారు దీంతో పలువురు ఆయనను అభినందించారు ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని ఈ సందర్భంగా పూల చంద్రమౌళి అన్నారు