పయనించే సూర్యుడు మార్చి 31 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆదోని స్త్రీలు చిన్నపిల్లల హాస్పిటల్ కి వెళ్ళిన కమిటీ సభ్యురాలు వెళ్లాలా లలితమ్మ.హాస్పెటల్ లో చికిత్స పొందుతున్న గర్బవతులను మరియు కాన్పులు అయిన తల్లులను పలకరించి హాస్పిటల్ లో డాక్టర్ల సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.అలాగే హాస్పిటల్ లో పనిచేస్తున్న నర్సులు సేవలు ఎలా ఉన్నాయి వారు మీకు సరైన సమయానికి మాత్రలు మందులు అందచేస్తున్నారా లేదా అని పేషెంట్లను వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు.కూటమి ప్రభుత్వం వచ్ఛాక ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ఎమ్మెల్యే అయ్యాక హాస్పిటల్ సిబ్బంది బాగా చూస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పరుశురాం పాల్గొన్నారు.