తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి 5లక్షలు ప్రమాద భీమా చెల్లింపు

పయనించే సూర్యుడు మార్చి 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారం గ్రామం, మాముడూరు పంచాయతీ,తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి 5లక్షలు ప్రమాద భీమా చెల్లింపురాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సౌజన్యంతో, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో ఈ రోజు మాముడూరు పంచాయతీలో నడిగడ్డ అగ్రహారం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి తూపిలి.వెంకటేశ్వర్లు జులై 2025 లో మరణించారు.కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రమాద భీమా 5లక్షల రూపాయలు విడుదల చేశారు.ఆ 5 లక్షల రూపాయల చెక్కు వివరాలను వారి సభ్యులకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ అందించేసి తెలుగుదేశం పార్టీ అన్ని వేళల అండగా ఉంటుందని ఓదార్చి,భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులు ఆరెద్దుల రామకృష్ణయ్య ,మరియు భారత మహసేన అధ్యక్షుడు జువ్విగుంట బాబు పాల్గొన్నారు