నాలుగు లేబర్ కోడ్సనురద్దు చేయాలిజీవోప్రతులుదగ్ధంటియుసిఐ

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 31, తల్లాడ రిపోర్టర్ మేడే కార్మికులు తమ రక్తం చిందించి సాధించుకున్న కార్మికుల హక్కులను బిజెపి ప్రభుత్వం ఒక కాలం పొటుతో రద్దు చేసిందని టియుసిఐ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు అన్నారు. టి యు సి ఐ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు తల్లాడ పట్టణంలో టి యు సి ఐ ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్స్ జీవో ప్రతుల్ని దగ్ధం చేయడం జరిగింది అనంతరం యు సి ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియా పాల్గొని మాట్లాడుతూ బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక రకాల చట్టాలను ఒక కలం పోటుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది ఈ చట్టాలను రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయను అని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి నాలుగు లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటంలో భాగస్వాములు కావాలని వారి కోరినారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ తల్లాడ బ్రాంచ్ కమిటీ నాయకులు జి కృష్ణ సత్యనారాయణ బాలు కృష్ణ నరేష్ రమణ రాఘవ వెంకటేశ్వర్లు రామకృష్ణతదితరు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *