పయనించే సూర్యడు / మార్చ్ 31/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కాప్రా సర్కిల్ పరిధిలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను నిర్వహించారు. ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్ సమీపంలో జరిగిన ఈ పనులను సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి స్వయంగా పర్యవేక్షించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌ల క్లీనింగ్: ఈ కార్యక్రమంలో భాగంగా ఈసీఐఎల్ ప్రధాన కూడలి వద్ద రహదారులపై మరియు ఫుట్‌పాత్‌లపై పేరుకుపోయిన చెత్త, మట్టి, మరియు రాళ్లను సిబ్బంది సహాయంతో తొలగించారు. పాదచారులకు ఇబ్బంది కలగకుండా ఫుట్‌పాత్‌లను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా డీసీ శ్రీహరి మాట్లాడుతూ, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ 99 రోజుల ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్ సుధీర్, ఎస్.ఎఫ్.ఏ భాగ్యలక్ష్మి మరియు ఇతర పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.