పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పయనించే సూర్యుడు మార్చ్ 31 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలోని నవ చైతన్య ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల 1995-1996 వ బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు మండల కేంద్రంలోని ఈ. జె ఫంక్షన్ హాల్ లో ఘనంగా సమ్మేళ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అలనాటి తరగతిలో 25 మంది విద్యార్థులు ఉండగా 1 7 మంది అబ్బాయిలు, 4 అమ్మాయిలు హాజరు కావడం జరిగింది. అలనాటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామదాసు మధుసూదన చారి, సీనియర్ ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్,జంగయ్య,విష్ణువర్ధన్ చారి, గోవర్ధన్ రావు , జ్యోతి పబ్లిక్ ప్రధానోపాధ్యాయులు గుజ్జ దామోదర్ రెడ్డి హాజరు కావడం జరిగింది. పూర్వ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు శాలువ, వ్యక్తిగత ఫోటోతో కూడిన మెమొంటోనుతో ఘనంగా సత్కరించారు. 30 సంవత్సరాల అపూర్వ కలయిక సందర్భంగా పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా అకాల మరణం చెందిన విద్యార్థిని విద్యార్థులను స్మరించుకున్నారు. అలనాటి సమయంలో పూర్వ విద్యార్థులకు సేవలు అందించిన ఆయమ్మ దొడ్ల ఎల్లమ్మను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని విద్యార్థులు ముచ్చర్ల విజయ్ కుమార్, జమ్మ సురేష్,నవీన్, మాడిచెట్టి సత్యం, శ్రీను, జగత్ రెడ్డి, కరుణాకర్రెడ్డి , కే. సురేష్, యాదగిరి, నాగేశ్వరరావు, వెంకటేష్, ముస్తాక్ అహ్మద్, సంతోష్,తిరుపతయ్య, లక్ష్మీపతి, రాజేందర్,కొత్త విజయ్,కే. కవిత,జి కవిత, నర్మదా,అరుణ తదితరులు పాల్గొన్నారు.