పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 31 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలంలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. పరీక్షల నిర్వహణలో అధికారులు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ, విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారు. సోమవారం నిర్వహించిన సోషల్ స్టడీస్ పరీక్ష ప్రశాంతంగా సాగింది. వివరాల ప్రకారం, ఈ పరీక్షకు మొత్తం 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) ఉస్మాన్ బాషా వెల్లడించారు. గైర్హాజరైన వారిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ నుంచి ఐదుగురు, జిల్లా పరిషత్ పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించడమే కాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేశామన్నారు