పేదల ఇందిరమ్మ ఇంటి కల నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం

* సింగిల్ విండో డైరెక్టర్ - మట్ట వెంకటయ్య గౌడ్

పయనించే సూర్యుడు, మార్చి 31 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో ప్రజా ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ భూమి పూజ నిర్వహించారు. సోమవారం సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మండల కేంద్రంలోని మోత్కు పార్వతమ్మ కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చొరవతో మంజూరు చేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, కార్యదర్శి గిరి గౌడ్, వార్డు సభ్యులు మారేపల్లి మంజుల శ్రీను, ముదికొండ రమేష్, జంగిలి ఆనంద్ రాజ్, కొయ్యల పుల్లయ్య, తుంగ శ్రీను, క్యాసరపు మల్లేష్, ఉడుత వెంకయ్య, ఉడుత పరమేష్, డేవిడ్, మట్ట మల్లేష్, రాజు, లింగం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *