బిజెపి సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి

బిజెపి రాష్ట్ర నేతలు రంజిత్ మోహన్, పో రెడ్డి శ్రీధర్, రాణి రుద్రమ

పయనించే సూర్యుడు మార్చి 31 కరీంనగర్ న్యూస్: బిజెపి సిద్ధాంతాన్ని, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని బిజెపి రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ సభ్యులు రంజిత్ మోహన్ రాష్ట్ర అధికార ప్రతినిధి పో రెడ్డి శ్రీధర్, రాణి రుద్రమ పిలుపునిచ్చారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ లో భాగంగా వెస్ట్, కొత్తపల్లి జోన్ , కొత్తపల్లి రూరల్ బిజెపి శ్రేణుల రెండు రోజుల శిక్షణ శిబిరం కొత్తపల్లి లోని తేజస్ డిఫెన్స్ , జూనియర్ కళాశాలలో జరిగింది. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా వక్తలుగా హాజరైన వారు మాట్లాడుతూ బలమైన బిజెపి సిద్ధాంతంతోనే నేడు పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించిందన్నారు. పార్టీని బూతు స్థాయి నుండి మరింత బలోపేతం చేయడానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై , ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయాలన్నారు. ఆదివారం శిక్షణ శిబిరం ముగిసిన అనంతరం పార్టీ శ్రేణులు ప్రధాని మోడీ 132 వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, సీనియర్ నాయకులు కన్నబోయిన ఓదెలు , గుజ్జ శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు కార్పొరేటర్ వాసాల రమేష్ , జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కర చారి కొత్తపల్లి జోన్ అధ్యక్షుడు ముత్తునూరి హరీష్ రావు, వెస్ట్ జోన్ అధ్యక్షుడు జాడి బాల్ రెడ్డి, కొత్తపల్లి రూరల్ మండలాధ్యక్షుడు కుంట తిరుపతి లతో పాటు బిజెపి కార్పోరేటర్లు, సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు , మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.