బీజేపీలో సభ్యత్వం తీసుకున్న సరసాని అర్జున్ రెడ్డి

పయనించే సూర్యుడు 31-3-2026 గుల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కన్నం అంజన్న కొమ్ము రాంబాబు ఆధ్వర్యంలో బీజేపీ లో చేరిన గొల్లపల్లి యువ నాయకుడు అర్జున్ రెడ్డి ఆయన చేరికతో బీజేపీ క్యాడర్ లో నూతన ఉత్సాహం గతంలో బిఆర్ఎస్ లో నియోజవర్గంలో ఆక్టివ్ గా ఉన్న అర్జున్ రెడ్డి మాట్లాడుతూ నా పైన నమ్మకంతో నన్ను పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ మండల నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నుండి మండలంలో బీజేపీ బలోపేతానికి అందరితో కలిసి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్ట మహేష్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెళ్ళి సత్యం మండల అధ్యక్షులు చెవులమద్ది శేఖర్ మండల ప్రధాన కార్యదర్శి దుస ప్రశాంత్ పట్టణ అధ్యక్షులు సంగం కళ్యాణ్ యువ మోర్చ మండల అధ్యక్షులు మారం గణేష్ మండల కోశాధికారి భీమా జలపతి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *