పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 31 రెంజల్ : రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో ప్రభుత్వ శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్, ఎన్సిసిఎఫ్ నేతృత్వంలో రెంజల్ మండలం బోర్గం గ్రామంలో మండల ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ గ్రామ సర్పంచ్ మల్కు జ్యోతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోబిన్ ఖాన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తిక్ యాదవ్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎల్ రాజ్ గ్రామ పెద్దలు సోమవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.క్వింటాలుకు 5875 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లు మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ స్పష్టం చేశారు.ఎకరానికి 7 క్వింటాళ్ల 62 కిలోలు శనగ పంటను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా శనగ పంటను విక్రయించాలని మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ సూచించారు.ఎకరానికి 7 క్వింటాళ్ల 62 కిలోలు పంట కొనుగోలు నిబంధనలు సడలించి రైతు పండించిన మొత్తం పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు నాయకులు మరియు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నీరడి గంగాధర్ నరేందర్ గ్రామ పెద్దలు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు.