పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 31 మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని మున్సిపల్ బోయిన్ పేట్ కి చెందిన మూగ ఆకాష్ ప్రమాదానికి గురి అయి కరీంనగర్ లోని ప్రయివేట్ ఆసుపత్రి లో చికిత్స పొంది ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చిన ఆకాష్ ను బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి పరామర్శించి వారి కుటుంబానికి తన మిత్రుల సహాయ సహకారంతో జమ చేసిన 21000/-వేల రూపాయలను అందించి వారికి అండగా నిలిచారు.నిస్వార్థంగా సహాయం అందించిన హాస్పిటల్ డాక్టర్ భరత్ రెడ్డి కి బోయిన్ పేట్ యువతకు తన మిత్రులకు ధన్యవాదములు తెలిపిన క్రాంతి.గతంలో కూడ బోయిన్ పేట్ లో ఎవరు ఆపదలో ఉన్న వారికీ అండగా నిలుస్తూ ప్రతి కుటుంబానికి తనకు తోచిన సహాయం అందిస్తున్న పోతరవేని శ్రీలతక్రాంతి ని బోయిన్ పేట్ వాసులు అభినందించారు