రైల్వే సౌకర్యాల కల్పనలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషి. అభినందనీయం అడబాల..

పయనించే సూర్యుడు మార్చి 31, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరం నుండి 4 ప్రధాన నగరాలకు ప్రతిరోజు రైలు సర్వీసులు నడిపేందుకు రైల్వే శాఖ నుండి ఆమోదం పొందడంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ చేసిన కృషి ఎంతో అభినందనీయమని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు .కాకినాడ జిల్లా నుండి విద్య ,ఉపాధి, వ్యాపార , వైద్యం తదితర అవసరాల కోసం ప్రతిరోజు నిత్యం వేలాది మంది రైళ్లలో రాజమండ్రి, హైదరాబాద్, మైసూర్, రాజస్థాన్లోని హిసార్ తదితర ప్రాంతాలకు వెళుతుంటారని అన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రాంతాలకు ప్రతిరోజు రైల్వే సర్వీసులు నడపాలని ఎంపీ ఉదయ శ్రీనివాస్ రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా దానిపై వారు వెంటనే స్పందించి ఆమోదం తెలిపారని అన్నారు. కాకినాడ ప్రజలు ఎంతో కాలం గా ఎదురుచూస్తున్న ఈ రైల్వే సౌకర్యాలు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో సాకార మయ్యాయని అన్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలు, స్థానిక అభివృద్ధిలో నిరంతరాయంగా చేస్తున్న కృషికి గుర్తింపుగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ శ్రీనివాస్ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ ఇటీవల నిర్వహించిన తాజా సర్వేలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం పొందడం గర్వకారణమని అన్నారు. ఈ సర్వేలో 10 కి 8.6% మార్కులు సాధించారని అన్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజల మధ్య నిత్యం ఉంటూ అభివృద్ధి పనులలో క్రియాశీలక భాగస్వామి అవుతున్న ఎంపీ కేంద్రం కేటాయించిన నిధులను కూడా అత్యంత సక్రమంగా వినియోగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో జిల్లా, రాష్ట్ర స్థాయి సమస్యలను ఇంచుమించు ప్రతిరోజు ప్రస్తావిస్తూ నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూర గుంటున్నారని అడబాల తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *