లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఏడాది కాలంగా నిరంతర అన్నదానం

పయనించే సూర్యుడు మార్చి 31 కరీంనగర్ న్యూస్: మానవ సేవయే మాధవ సేవగా భావించి, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గత ఏడాది కాలంగా నగరంలో నిరంతరాయంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నేటితో 365 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మరియు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు, మరియు 66వ డివిజన్ కార్పొరేటర్ వంగల పవన్ ముఖ్య అతిథులుగా హాజరై, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ మ్యడం శివకాంత్,ప్రెసిడెంట్ ముక్క శరత్ కృష్ణ,బట్టు వినోద్ మరియు క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *