వివాదాలకు నిలయంగా మారిన ఆ నియోజకవర్గ సెగ్మెంట్

* కో-ఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనానికి ఒప్పుకోం సీఎం దృష్టికి తీసుకెళ్తా మాచాని సోమనాథ్ * సైకిల్ పార్టీ నేతల నిర్ణయాలతో పార్టీకి దూరమవుతున్న చేనేతలు * 2014 అధికారం లో ఉన్నప్పుడు లేని వివాదాలు 2026 లో ఎందుకు ఈ వివాదాలు * ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టిడిపి ఓటమిపాలవడం కాయం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 31, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ కర్నూలు జిల్లాలో అదొక నియోజకవర్గ సిగ్మెంట్, దానికి మరో పేరు చేనేతపూరి అనికూడా అంటారు. అక్కడ అధికారం చేపట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నది. సైకిల్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. అప్పటినుండి ఆ సెగ్మెంట్లో ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది, మొదటి మిలిటరీ కాలని స్థలాలు కబ్జా, కోతులు బావి స్థలం వివాదం, అంటూ ఇలా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉండటం మరో వివాదం తెరపైకి వచ్చింది. అదేమిటంటే చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీని ఆప్కో లోకి విలీనం చేయడం, ఎమ్మిగనూరు అంటే చేనేతలు అని ఇక్కడ తయారయ్యే వస్త్రాలు,బెడ్ సీట్లు, దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని,భారత్ దేశంతో పాటు విదేశాలకు కూడా ఏగుమతి అవుతాయి అన్నారు. ఎమ్మిగనూరు చేనేతలకు పితామహుడైన పద్మశ్రీ మాచాని సోమప్ప చేనేతల ఆర్థికంగా అండగ ఉండడానికి స్థాపించిన సొసైటీని, రాజకీయ నాయకులు కుట్ర పూరిత రాజకీయం చేస్తున్నారని,మాచాని సోమప్ప దూర ద్రుష్టి, కృషి ఫలితమే వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీలు వేలాది చేనేత కుటుంబాలకు జీవనాధారంగా నిలిచాయన్నారు. చేనేతలను జీవనాధారం దెబ్బతీస్తే సహించేది లేదన్నారు. మాచాని సోమప్ప మనవడు మాచాని సోమనాథ్ మాట్లాడుతూ, మా తాత స్థాపించిన వీవర్స్ కో-ఆపరేటివ్, పాల సొసైటీలను కొందరు దుష్టశక్తులు రాజకీయ కుట్రలతో నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. 31వ తేదీ మంగళవారం జరిగే సర్వసభ్య సమావేశానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు హాజరుకావాలని, నష్టాల్లో ఉన్న ఆప్కోలోకి విలీనం చేయడం వలన కో-ఆపరేటివ్ సొసైటీ తీవ్ర నష్టాలు చవిచూస్తుందన్నారు. కాబట్టి ఈ విలీనానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, సంబంధిత శాఖ మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకెల్లి విలీనానికి విముక్తి కలిగిస్తామన్నారు. 2014 ఎలక్షన్లో ఎమ్మిగనూరు లో సైకిల్ పార్టీ జెండా ఎగరవేసింది. మొదటిసారిగా బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి గెలిచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత ఐదేళ్ల పాలనలో ఎలాంటి వివాదాలు లేకుండా పాలన సాఫీగా సాగింది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా రెండోసారిగా గెలిచినప్పటినుండి, నియోజకవర్గం స్థలాలు కబ్జా ఇతర సమస్యలతో రోజులు రోజుకి పేట్రేగిపోతూ వివాదాల పాలవుతుంది. ఎమ్మిగనూరు టౌన్ టిడిపి పార్టీకి కంచుకోట అక్కడ సగానికి పైగా చేనేత ఓట్లు కీలకం, అదే చేనేతల పొట్టపై కొట్టేందుకు చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ ఆప్కో లో విలీనం పేరుతో రోజురోజుకు వివాదం ముదరడంతో, టిడిపి పార్టీ పై అసహ్యించుకుంటున్న చేనేత కుటుంబాలు, ఇది ఇలాగే కొనసాగితే కర్నూలు జిల్లాలో మరొక నియోజకవర్గం టిడిపి పార్టీ కోల్పోవాల్సి వస్తుందని, ఇప్పటికైనా అధిష్టానం సీఎం చంద్రబాబు నాయుడు, కలగజేసుకుని ఇక్కడ పరిస్థితులను సరిచేయక పొతే టిడిపి పార్టీ ఓటమితో భారీ మూల్యం మూట కట్టుకోవాల్సి వస్తుందని ఇక్కడ చేనేతల ఓట్లే గెలుపుకి కారణమని చర్చించుకుంటున్న పట్టణ వాసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *