శ్రీశైలంలో ఆధ్యాత్మిక వైభవంతో సంగీత నృత్యోత్సవం ఘనంగా

పయనించే సూర్యుడు మర్చి 31 (మల్కాజిగిరి ఇంచార్జి డా. రఘుపతి ) ప్రపంచ ప్రఖ్యాత శైవక్షేత్రాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి–భ్రమరాంభికా దేవాలయం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. పురాణాల ప్రకారం, పరమేశ్వరుడు మల్లికార్జున స్వరూపంలో ఇక్కడ వెలసి, పార్వతీ దేవి భ్రమరాంభికా రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారని విశ్వాసం. ఈ పవిత్ర క్షేత్రం అనాదిగా భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది. దైవక్షేత్రంలో డాక్టర్ రఘుపతి ఆధ్వర్యంలో మార్చి 29, 2026న సంగీత నృత్యోత్సవం వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకలో పాల్గొన్న చిన్నారులు, కళాకారులు తమ అద్భుత ప్రతిభతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. భక్తి రసంతో నిండిన సంగీతం, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపాయి. ఈ కార్యక్రమానికి దేవాలయ శాఖ ఈవో శ్రీనివాసరావు విశేష సహకారం అందించి ప్రోత్సహించారు. వారి ఆదరణతో కార్యక్రమం మరింత విజయవంతమైందని నిర్వాహకులు పేర్కొన్నారు. చివరగా కళాకారులను సత్కరించి, వారి ప్రతిభను అభినందించారు. ఈ నృత్యోత్సవం భక్తి, సంస్కృతి, కళల సమ్మేళనంగా నిలిచి అందరి ప్రశంసలను పొందింది.