సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలి

★ ఎంపీడీవో శ్రీనివాస్ ★ అంగన్వాడీలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 31 సాలూర :అంగన్వాడీలు సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని మండల ఎంపీడీవో శ్రీనివాస్ ఆదేశించారు సోమవారం సాలూర మండలం హున్సా మరియు మందర్న గ్రామాల అంగన్వాడీలను ఆకస్మికంగా సందర్శించారు రికార్డులు మరియు హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు పిల్లలకు మరియు బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాలు వహించకూడదని తెలిపారు.ఫిర్యాదులు వచ్చినట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రావుబా గంగాధర్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.