పయనించే సూర్యుడు మార్చి 31 బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక మేజర్ గ్రామపంచాయతీ కూరగాయల సంత వేలంపాట సారపక గ్రామపంచాయతీలో సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ మరియు కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సంత వేలం పాట పాడడానికి ఎనిమిది మంది పాటదారులు పాల్గొన్నారు. సంత వేలంపాటను ధరావత్ మమత 7,25,000 కు దక్కించుకున్నారు . ఈ సందర్భంగా సర్పంచ్ కిషోర్ నాయక్ మాట్లాడుతూ ఈ సంవత్సరం సంత లక్ష రూపాయలు అదనంగా పాడడం ద్వారా గ్రామ పంచాయతీకి అదనంగా లక్ష రూపాయలు ఆదాయం వచ్చిందని , ఇదే క్రమంలో పశువుల సంతను కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందని దానికి సంబంధించినటువంటి వివరాల కోసం డిఎల్పిఓకు విన్నపం పెట్టామని వారు ఒప్పుకుంటే పశువుల సంతను కూడా సారపాకలో ఏర్పాటు చేస్తామని సర్పంచ్ కిషోర్ నాయక్ తెలియజేశారు. అంతేకాకుండా సారపాక సంత ఇప్పుడు ఉన్నటువంటి స్థలం నుండి బ్రిడ్జి ప్రక్కన ఉన్నటువంటి స్థలానికి మారుస్తున్నామని అక్కడ కూరగాయలు అమ్మడానికి వచ్చే సంతదారులకు అన్ని రకాల సదుపాయాలు కరెంట్ మరియు మంచినీళ్లు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. సంత పాడుకున్న వారు 24 గంటల వ్యవధిలో పైకము మొత్తం చెల్లించవలెనని లేనియెడల రెండవ సంతదారునికి సంత వేలం పాట వెళుతుందని ,వారు కూడా పైకము చెల్లించని యెడల మూడోపాటదారునికి సంత వెళ్తుందని సర్పంచ్ కిషోర్ నాయక్ వివరాలు తెలియజేశారు. బూర్గంపాడు లో ఏర్పాటు చేసినటువంటి సంత వేలంపాటను జక్కం నాగేశ్వరరావు 3 లక్షలకు దక్కించుకున్నారు, మొరంపల్లి బంజర్ లో సంత వేలంపాట వాయిదా పడ్డదని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.