సూరంపల్లి గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి చొరవ – పశువులకు ఉచిత టీకాల కార్యక్రమం ప్రారంభం

"నీటి సరఫరా కోసం మోటార్ దింపిన సర్పంచ్ స్వప్న ఉప సర్పంచ్ తాటి సాయి"

పయనించే సూర్యుడు మార్చి 31 రాజేష్) సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో నాలుగో వార్డ్‌లో ఏర్పడిన నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ గంగాధరి స్వప్న స్వామి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో నీటి సరఫరా కోసం వాటర్ మోటార్ దింపి నీళ్లు విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. నీళ్ల సమస్య జరుగుతున్న నేపథ్యంలో వెంటనే మోటార్ దింపించి, నీటి సరఫరా కోసం వార్డుల వారీగా పరిశీలన నిర్వహించారు. ప్రజలకు తక్షణమే తాగునీరు అందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అదనంగా కొత్త మోటార్‌ను ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇకపోతే, గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలి కుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పరశురాం పర్యవేక్షణలో నిర్వహించారు. గ్రామంలోని రైతులు తమ గేదెలు, ఆవులు, మేకలు వంటి పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ టీకాలు పశువులను ప్రమాదకర వ్యాధుల నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తాటి సాయి మాట్లాడుతూ, గ్రామంలో ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడం పాలకవర్గ బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా కోసం వాటర్ మోటార్ దింపి నీళ్లు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉంచాలని వారు అన్నారు. ఇటువంటి ప్రాథమిక అవసరాలను అందించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాటి సాయి, బొల్లం సత్తవ్వ, దోమల ప్రమీల, సాయిలు .బండి శ్రీలత తిరుపతి, కడారి పోచయ్య, ముత్యాల నరసవ్వ సత్యయ్య, బొల్లం రాజేష్, కేంబసారీ మల్లేష్, గంగాధర నర్సయ్య, స్టాప్ డాక్టర్ పి నర్సింలు. ఎన్ సమ్మయ్య . వారి బృందం పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్దలు. గంగాధరి నర్సయ్య. బొమ్మ బిక్షపతి. బోయ శ్రీను . కడారి శంకర్ బండి కృష్ణ. తైల కుమార్ ప్రవీణ్ యాదయ్య మరియు గ్రామ ప్రజలు మరియు యువకులు నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో ఒకవైపు నీటి సమస్య పరిష్కారం, మరోవైపు పశువుల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టడం గ్రామ అభివృద్ధికి మంచి సంకేతంగా భావిస్తున్నారు.