అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌కి తృటిలో తప్పిన పెనుప్రమాదం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 01.04 2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌ వెనక ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.