పయనించే సూర్యుడు-01-04-2026-రాజంపేట న్యూస్ : తిరుపతి జిల్లా చిట్వేలి మండల పరిధిలోని తుమ్మకొండ వడ్డిపల్లిలోని సర్వే నెంబర్ 26 లో ఊరకుంటను సంబంధిత రెవిన్యూ, విద్యుత్ అధికారుల సహకారంతో గ్రామస్తులు ఆక్రమించుకుని వేరే సర్వే నెంబర్లలలో మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు, బోర్లను ఊరకుంటలో ఎర్పాటు చేసి ఊరకుంటను ఆక్రమించారని, అక్రమణకు గురైన ఊరకుంటను సంరక్షించాలని ఆవులకుంట గంగయ్య ఫిబ్రవరి ఒకటో తేదీ చిట్వేలి మండల తహసిల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంబంధిత రెవెన్యూ ఉన్నతాదికారులు ఆక్రమణకు గురైన ఊరకుంట సంరక్షణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థుడు ఆవులకుంట గంగయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవిన్యూ అధికారుల అండదండలతోనే గ్రామస్థులు ఊరకుంటను ఆక్రమించారని ఆయన వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అక్రమణకు గురైన ఊరకుంటను సంరక్షించాలని ఆయన కోరారు.