ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి పై యాభై లక్షల రూపాయలు లంచం

ఆరోపణల పై ప్రభుత్వం సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన నూర్ అహ్మద్ ఎన్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. తన బిల్డింగ్ కట్టడానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి యాభై లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడని, అడ్వాన్స్ గా పది లక్షల రూపాయలు ఇచ్చానని ఆరోపించిన టిడిపి సీనియర్ నాయకుడు సౌదీ రౌఫ్ ఆరోపణలను సుమోటోగా స్వీకరించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి లై డిటెక్టర్ పరీక్షల ద్వారా నిజ నిర్ధారణ చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షిబ్లీ కి , మంత్రులు మరియు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే మరో వైపు ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి పై వరుసగా అవినీతి ఆరోపణలు వస్తుండటం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లై డిటెక్టర్ పరీక్షలో తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి సిద్ధపడాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో యం.హెచ్. పి. యస్. రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, రైతు కూలీ సంఘం నాయకులు ప్రసాద్, యం. హెచ్. పి. యస్. నాయకులు షకీల్ పాల్గొన్నారు ఎ. నూర్ అహ్మద్, ⁠మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *