పయనించే సూర్యుడు 01-04-2026 ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: ఖయాదత్ యూత్ ఫౌండేషన్ (క్యూవైయఫ్) సభ్యులు ఉట్నూర్ ఇంచార్జి సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ట్రైనింగ్ కలెక్టర్ సలోని ఛబ్రా ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు సంస్థ స్థాపక అధ్యక్షుడు షేక్ తౌఫీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఉట్నూర్ ప్రాంత అభివృద్ధి ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె విశేషంగా కృషి చేయాలని ఆకాంక్షించారు ప్రజాసేవలో ఆమెకు విజయాలు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సజీద్ సిద్దిఖీ సంయుక్త కార్యదర్శి షైక్ సోహెల్ పాషా విద్యా సలహాదారుడు రాథోడ్ వెంకటేష్ సభ్యులు అతీక్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.