ఉత్తమ డైనమిక్ సర్పంచ్ అవార్డు అందుకున్న ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 01 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సమిష్టిగా నిర్వహించిన ఉగాది పురస్కారాలు 2026 కు సంబంధించి ఉత్తమ యంగ్ డైనమిక్ సర్పంచ్ గా ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ కు హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో శాలువాతో సత్కరించి ఉత్తమ యంగ్ డైనమిక్ సర్పంచ్ అవార్డును యాజమాన్యం అందించారు ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ అనతి కాలంలోనే నన్ను గుర్తించి ఈ గొప్ప అవార్డును అందించడం గర్వంగా ఉందని మీరు అందించిన స్ఫూర్తితో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అందరి ఐక్యత సహకారంతో ముందుకు వెళ్లి ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు