ఎంఈఓ కురుమయ్య చేతుల మీదుగా ధర్మ టీచర్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుడిపల్లి నిరంజన్ ప్రధాన కార్యదర్శి అంజనేయులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ మండల కేంద్రంలో ధర్మ టీచర్ యూనియన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంఈఓ కురుమయ్య క్యాలెండర్‌ను ఆవిష్కరించి, ఉపాధ్యాయుల ఐక్యతకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుడిపల్లి నిరంజన్, ప్రధాన కార్యదర్శి కూరాకుల ఆంజనేయులు, గౌరవాధ్యక్షులు కొంగరి జానయ్య, జిల్లా కార్యదర్శి వలిగి తిరుపతయ్య, నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి పనిచేస్తుందని సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *