ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో సర్పంచులకు ఘన సన్మానo

పయనించే సూర్యుడు న్యూస్, 01-04-2026 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): ప్రజలకు చేరువగా ఉంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఐదేళ్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్న సర్పంచుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ,ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అన్నారు.ఏలేశ్వరం మండల సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా వారి సేవలను గుర్తిస్తూ మంగళవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ఎంపీడీవో రామరాజు వర్మ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ,జనసేన సమన్వయ కర్త మేడిశెట్టి బాబీ కూటమి శ్రేణులతో కలిసి సర్పంచులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికలు, బట్టలు అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ ఆయా గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల చేసిన కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో వారు మరెన్నో పదవులు చేపట్టి గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, పెంటకోట మోహన్, సుంకర సత్యనారాయణ, బుద్ధ సూర్య ప్రకాష్, భీశెట్టి అప్పలరాజు, సూతి వీరకృష్ణ ప్రసాద్, యిజనగిరి ప్రసాద్, బస్సా ప్రసాద్, మైరాల కనకారావు,పలివెల శ్రీనివాస్, పెంటకోట శ్రీధర్, పసల సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు, మండల పరిధిలో సర్పంచులు, ఎంపీటీసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *