కర్నూలు జిల్లా 2026 27 బడ్జెట్ సమావేశాన్ని

ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్ అధ్యక్ష జరిగింది.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 ఆదోని రూరల్ రిపోర్టర్ కర్నూల్ లో నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ఆహ్వాన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరియు టీజీ భరత్ దస్తగిరి నాగేశ్వర్ రెడ్డి రాఘవేంద్ర రెడ్డి వైకుంఠం జ్యోతి జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బుజ్జమ్మ డైరెక్టర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప* మాట్లాడుతూ, ఉమ్మడి ఆదోని డివిజన్‌లోని ఆదోని, కోసిగి, కౌతాళం, హాలహర్వి మండలాల్లో వలసలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. వలసల నివారణకు వేదవతి నది నుంచి సాగునీరు అందించడంతో పాటు హంద్రీనీవా నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తుంగభద్ర కాలువ కు నీరు అందించాలని కోరారు. గురుకుల పాఠశాలలు, బి.సి వసతి గృహాలు పెంచాలని, అలాగే ఉపాధిహామీ పనుల ద్వారా ఆయకట్టు రహదారులు ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *