కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ 01-04 -2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా, చేగుంట మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు చెక్కులను అందజేస్తూ, గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు పడే ఇబ్బందులను గమనించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా దీనిని కొనసాగిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఇబ్బందులపై త్వరలోనే అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోచేగుంట తహసీల్దార్ శివ ప్రసాద్ , నార్సింగి తహసీల్దార్ గ్రేసీ భాయి,ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, స్థానిక నాయకులు , తదితరులు పాల్గొన్నారు