గ్రామ అభివృద్ధి నా లక్ష్యం

* వెల్దండ గ్రామ సర్పంచ్ - మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 01 2026, నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో వెల్దండ గ్రామ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని 7వ వార్డు ముదిరాజ్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు. అంతకు ముందు గ్రామంలోని 9 వార్డులో కొత్త బోరు మోటారును ఏర్పాటుచేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి గిరి గౌడ్, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, వార్డు సభ్యులు మారేపల్లి మంజులశ్రీను, ముదికొండ కవిత రమేష్, పిల్లి దేవేందర్, ఎస్ శేఖర్, మాసుల బాలరాజు, జంగిలి ఆనంద్, నాయకులు కొయ్యల పుల్లయ్య, క్యాసరపు మల్లేష్, ఈదులపల్లి శ్రీనివాస్, బాదేపల్లి రామకృష్ణ, సాదమోని శ్రీనివాస్, అన్నెపు వెంకటయ్య, సురేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *