
పయనించే సూర్యుడు 01-04-2026 (చింతకాని మండలం రిపోర్టర్.వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు సంబంధించిన హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ప్రారంభించగా, అనంతరం కిలార్ మనోహర్ వ్యాక్సిన్ క్యారియర్‌ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబ్జి, ఎంపీడీవో శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి రామారావు, ఎస్సై వీరేందర్ పాల్గొన్నారు. చింతకాని వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండలంలోని 14 సంవత్సరాల వయస్సు గల 26 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకా అందించారు. ఈ టీకా ముఖ్య ఉద్దేశ్యం ఆడపిల్లల్లో సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించడం అని వైద్యులు తెలిపారు. రేపటి నుంచి మూడు నెలలపాటు ఈ టీకా కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రామారావు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ ఈ కార్యక్రమాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శ్రీదేవి, పీడీఎంఓ సిబ్బంది, సోషల్ సూపర్వైజర్లు వీరేందర్, కృష్ణారావు, రేచల్ రాణి, వ్యాక్సినేటర్లు పద్మావతి, లక్ష్మి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రజిని, శ్రీనివాస్, స్టాఫ్ నర్సులు సుజాత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.