చేగుంటలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు, ఉచిత కంటి వైద్య శిబిరం

పయనించే సూర్యుడు 01-04-2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం నాడు అర్రైవ్ భద్రతా కార్యక్రమంలో భాగంగా మూడవ విడత అవగాహన సదస్సు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఐశ్వర్య ఆప్టికల్స్ సహకారంతో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో 98% మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల గతంలో మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదం వంటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ డ్రైవర్లను హెచ్చరించారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని తోటి ప్రయాణికుల భద్రతను గౌరవిస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ క్రమంలో డ్రైవర్లకు దృష్టి లోపాలు ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఐశ్వర్య ఐ కేర్ వైద్య సిబ్బందితో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ అద్దాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డీఎస్పీ రామాయంపేట సిఐ చేగుంట ఎస్.ఐ. చైతన్య కుమార్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శంభుని శ్రీనివాస్ సెక్రెటరీ పులబోయిన నాగరాజు ట్రెజరర్ నాగేశ్వర్ జోన్ చైర్ పర్సన్ ఏ. సుఖేందర్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రెటరీ ధ్యావ లింగమూర్తి, డిసి సిహెచ్ నరసింహులు క్లబ్ సభ్యులు పోలీస్ అధికారులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.