
పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 1 ,తల్లాడ రిపోర్టర్ తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ లో 325 మంది రోజులకు నిర్వహించి మందులు పంపిణీ చేశామని డాక్టర్ ప్రత్యూష తెలిపారు, సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు, 57 మందిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం రిఫర్ చేశామని విభాగాల వారీగా సాధారణ వైద్యంలో 153 మంది ప్రసూతి గైనకాలజీ విభాగంలో 62 మంది, చిన్నపిల్లలకు 43 మందికి, ఆర్థోపెడిక్సు భాగంలో 75 మంది కంటి విభాగంలో 56 మంది దంత విభాగంలో 15 మందికి వైద్య సేవలు అందించామన్నారు, గైనకాలజీ విభాగంలో ఒక పాప్స్ నియర్ పరీక్ష నిర్వహించారు టీ హబ్ ద్వారా 64 నమోనాలను సేకరించారు అదనంగా టీవీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి అనుమానితులైన 62 మందికి ఎక్స్రే పరీక్షలు నిర్వహించారు, 50 మందికి స్ఫుటం నమూనాలను సేకరించారు క్యాంపు ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారు, ఆరోగ్యంపై అవగాహన కల్పించామన్నారు, ఖమ్మం నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లు సూపర్వైజర్ స్టాఫ్, ఎక్స్ రే టెక్నీషియన్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు, క్యాంపులు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి డాక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీడీవో అంబటి శ్రీధర్ రాజు, డిప్యూటీ తాసిల్దార్ రెహమాన్, ఎస్సై బి. వెంకటేష్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి) ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
