తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు

★ పరీద్పేట్ సర్పంచ్ బోర్లకు మరమ్మత్తులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 ,మాచారెడ్డి రిపోర్టర్ హోబిల్ రెడ్డి ఉమ్మడి మాచారెడ్డి మండల పరిధిలోని పాల్వంచ మండల పరీద్పేట్ గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహ రెడ్డి రాబోయే వేసవి ఎద్దడిని తట్టుకునేందుకు గ్రామంలోని బోర్లకు మరమ్మత్తులు చేయించి బిగించి గ్రామంలో మంచినీటిని సరఫరా చేసేందుకు మంగళవారం సమాయత్తం అయ్యారు, వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ముందస్తు ప్రణాళికతో సర్పంచ్ చేపట్టిన ముందస్తు చర్యలకు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శి ,గ్రామ పంచాయతి సిబ్బంది. గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.