తాటి, ఈత ఉత్పత్తులతో నిత్యం స్వయం ఉపాధి

పయనించే సూర్యడు 01-04-2026 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్ల తాటి, ఈత ఉత్పత్తులతో స్వయం ఉపాధి పొందవచ్చని గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం బృందావనపురం లో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాటి మరియు ఈత ఉత్పత్తులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం కల్లు, ముంజలే కాకుండా తాటి, ఈత కల్లు నుండి నీర, బెల్లం నిత్యం తయారు చేసుకొని నిత్యం ఆదాయం పొందవచన్నారు. వీటిలో అనేక ఔషద గుణాలున్నాయన్నారు. తాటి, ఈత బెల్లం, నీరా ను నిత్యం ఆహారం లో భాగంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. తాటి ముంజల నుండి ఇంకా పలు రకాల ఉత్పత్తులు కూడా తయారు చేసుకోవచన్నారు. ఈ కార్యక్రమం లో ఆ గ్రామ సర్పంచ్ కంభంపాటి సరిత, మాజీ సర్పంచ్ ఆనంతుల ఆంజనేయులు, కాసాని ఉపేందర్, సిరి ఫౌండేషన్ వ్వవస్థాపకులు డాక్టర్ మొలుగూరి గోపయ్య, పలువురు గీత కార్మికులు పాల్గొన్నారు.