పయనించే సూర్యుడు 01-04-2026 కీసర సర్కిల్, నాగారం డివిజన్లోని శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి దశమ వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా కొనసాగుతున్నాయి. సంప్రదాయ అలంకరణలతో అలరారుతున్న ఆలయం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ కౌకుంట్ల చంద్రా రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్లు గూడూరు ఆంజనేయులు గౌడ్, పంగ హరిబాబుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఎ. మల్లేష్, కె. లింగం, ఎ. ఉషయ్య, ఎ. ఆంజనేయులు, పంగ శ్రీహరి, పరమేష్, ఎ. బాబు, కె. రవి, ఎ. వామన్ రావు, నిమ్మల కృష్ణ, బాబు రావు, అశోక్, లింగం, కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చారు. ఈ సందర్భంగా కౌకుంట్ల చంద్రా రెడ్డి మాట్లాడుతూ బంగారు మైసమ్మ అమ్మవారి కటాక్షంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక మహోత్సవాలు సమాజంలో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు భక్తి భావంతో నిర్వహించబడుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ భక్తి పరవశంలో మునిగిపోతున్నారు. ఈ ఉత్సవాలతో నాగారం డివిజన్ అంతటా ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు అని ఈ సందర్భంగా తెలిపారు.