నేడు బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా వైద్య శిబిరం .

వైద్యాధికారిని డాక్టర్ సృజన .

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఏప్రిల్ 1న బుధవారము రోజు బిజినేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్యులచే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని స్థానిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ సృజన తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ సృజన‌ మాట్లాడుతూ నిపుణులైన డాక్టర్లు గ్రామాలకు వచ్చి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు సద్వినియోగం చేసుకొని వారి సలహాలు సూచనలు పాటిస్తూ, అవసరమైన వారు ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరారు. *ఏప్రిల్ 1న జరిగే వైద్య శిబిరం లో స్త్రీ వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్య నిపుణులు, ఎముకలు /కీళ్ల వైద్య నిపుణులు, దంత వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్, మొదలగు డాక్టర్లు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాధారణ ఆస్పత్రి నుంచి వచ్చి ఇట్టి క్యాంపును నిర్వహిస్తున్నారు కావున బిజినపల్లి మండల ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సృజన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *