పయనించే సూర్యుడు 01-04-2026 తెలంగాణ శాసనసభలో ఆమోదం పొందిన తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ బిల్, 2024పై న్యాయవాది, ఎన్బీఎంఐ మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులపై జరిగే దాడులను నివారించేందుకు కీలకంగా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. న్యాయవాదుల భద్రత, గౌరవాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టం అమలుతో న్యాయవాదుల్లో నమ్మకం పెరుగుతుందని, న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని రవి రాజ్ రాథోడ్ పేర్కొన్నారు.