పాఠశాలకు టేబుల్ బహుకరణ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 0104.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె నాగరాజ) చౌడేపల్లి మండలం కోటూరు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి ఎగవింటి గురు కార్తీక్ ఇటీవల విడుదలైన నవోదయ పరీక్షలో అర్హత సాధించాడు అతని తండ్రి సురేష్ పాఠశాలకు టేబులు డొనేట్ చేయడం జరిగింది మండల విద్యాశాఖ అధికారి కేశవరెడ్డి తిరుమలమ్మ గురు కార్తీక్ ను అభినందించారు గతంలో పాఠశాలలో కేవలం ఐదు మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉండేవారని కానీ ప్రభుత్వం ఇప్పుడు 9 మంది ఉపాధ్యాయులను కేటాయించడం జరిగిందని అందువల్ల విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రతి ఉపాధ్యాయుడు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోటూరు పాఠశాల అభ్యున్నతకు ప్రతి ఒక్కరు తోడ్పాటునందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బళ్ళాపురం మురళి తెలియజేశారు గురు కార్తీక్ నవోదయ ఎంపిక పట్ల పలువురు గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్కే భాగ్యలక్ష్మి తేజస్విని బాబు రమేష్ షాహిన్ రమణమ్మ ఉషారాణి శివకుమార్ రమణా పాల్గొన్నారు