పిన్నెల్లిపై పెట్టిన కేసులు కక్షసాధింపే – మాచర్లలో విడదల రజిని ఫైర్…

పయనించే సూర్యుడు న్యూస్ 01-04-2026 యడ్లపాడు మండల ప్రతినిధి.. పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపుగా బనాయించిన అక్రమ కేసులో అరెస్టు చేసి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి వర్యులు విడదల రజిని ఈరోజు మాచర్లలోని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసాన్ని సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజకీయ ద్వేషంతోనే కేసులు పెట్టడం దురదృష్టకరమని, ప్రజల మద్దతు ఉన్న నాయకులను ఇలాగే అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిజాయితీగా ప్రజల కోసం పని చేసే నాయకులను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు ఎంత చేసినా ప్రజలు సహించరని, చివరకు న్యాయం గెలుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు పి. ఝాన్సీ సాగర్, రాచమంటి చింతరావు, కర్నాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్శనతో మాచర్లలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *